'10 ఎంపీ సీట్లు గెలుస్తాం'

'10 ఎంపీ సీట్లు గెలుస్తాం'

తెలంగాణలోని లోక్‌సభ ఎన్నికల్లో 10 ఎంపీ సీట్లు గెలుస్తాం అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన ఖమ్మంలో మీడియాతో మాట్లాడారు. ఖమ్మం కాంగ్రెస్ లో గ్రూపు లు లేవని స్పష్టం చేశారు. అందరూ రాహుల్ గాంధీని ప్రధాని చెయ్యాలనే పని చేస్తున్నామన్నారు. ఖమ్మం ఎంపీ సీటు గెలిపించటంలో కీలకపాత్ర పోషిస్తానన్నారు. 10 ఎంపీ సీట్లు గెలుస్తామని బట్టి ధీమా వ్యక్తం చేశారు. 16 కాదు..120 ఎంపీ సీట్లు అని తెలంగాణ సీఎం కేసీఆర్ అనటం వెనక అర్థం ఏంటి?.. దేశ వ్యాప్తంగా కూడా ఎంపీలను కొంటాడా? అని భట్టి విక్రమార్క విమర్శించారు.