పాడె మోసిన రేణుకా చౌదరి

పాడె మోసిన రేణుకా చౌదరి

దివంగత పీసీసీ మాజీ అధ్యక్షుడు మల్లు అనంత రాములు కుమారుడు, కాంగ్రెస్‌ నేత మల్లు రమేష్ అంత్యక్రియలు ఇవాళ ముగిశాయి. మల్లు రమేష్ తన ముఖ్య అనుచరుడు కావడంతో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి స్వయంగా పాడె మోశారు. మల్లు కుటుంబసభ్యులను ఓదార్చారు. అంతకముందు ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలో మల్లు రమేష్‌కు పార్టీ నాయకులు నివాళులర్పించారు. మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క తదితరులు ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.