మమాంగం ఫస్ట్ లుక్ అదిరింది

మమాంగం ఫస్ట్ లుక్ అదిరింది

మమ్ముట్టి హీరోగా మలయాళంలో తెరకెక్కుతున్న సినిమా మమాంగం.  భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఈరోజు రిలీజ్ చేశారు.  మమాంగం అనే పండుగ చుట్టూ ఈ కథ నడుస్తుంది.  పండుగ సమయంలో ఇద్దరు వీరుల మధ్య జరిగే యుద్దమ్ ఆధారంగా సినిమా తెరకెక్కింది.  

ఈ సినిమా కోసం మమ్ముట్టి చాలా కష్టపడ్డాడు.  17 శతాబ్దపు కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎం పద్మకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.  కావ్య మూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.  సినిమా రిలీజ్ ఎప్పుడు అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.