బీజేపీకి 200లోపే.. 135 సీట్లకే పరిమితం కావొచ్చు..!

బీజేపీకి 200లోపే.. 135 సీట్లకే పరిమితం కావొచ్చు..!

ఎన్నికలు వచ్చాయంటే ఫలితాలపై ఎవరి అంచనాలు వాళ్లకుంటాయి. వివిధ ఛానెళ్లు, సంస్థలు నిర్వహించే సర్వేలతో పాటు.. నేతలు కూడా వీటిపై ప్రత్యేకంగా దృష్టిపెడుతుంటారు. అయితే, ఈ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి 200కు మించి సీట్లు గెలవడం అసాధ్యమని తేల్చేశారు తృణమూల్‌ కాంగ్రెస్ అధినేత, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఇక పరిస్థితులు కలిసి రాకుంటే పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందని.. ఆ పార్టీ కనిష్ఠంగా 135 సీట్లకే పరిమితం కావచ్చన్నారు. కోల్‌కతాలో టీఎంసీ మేనిఫెస్టోను విడుదల చేసిన సందర్భంగా .. సార్వత్రిక ఎన్నికల ఫలితాలను అంచనా వేస్తూ రూపొందించిన ఓ అధ్యయన నివేదికను చదివి వినిపించారు మమత. ఆ నివేదిక ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ల్లోని 193 లోక్‌సభ స్థానాల్లో భారతీయ జనతా పార్టీకి వచ్చే సీట్లు కేవలం 5 నుంచి 10 మాత్రమే నని ప్రకటించారామె.