మోడీపై దీదీ సంచలన వ్యాఖ్యలు 

మోడీపై దీదీ సంచలన వ్యాఖ్యలు 

ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన కోసం మొన్నటి రోజున బంగ్లాదేశ్ వెళ్లిన సంగతి తెలిసిందే.  బంగ్లాదేశ్ 50 వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో అయన పాల్గొన్నారు.  వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రధాని, నిన్న రాత్రి తిరిగి ఇండియాకు బయటలుదేరి వచ్చారు.  ప్రధాని రెండు రోజులపాటు బంగ్లాదేశ్ కు వెళ్లడాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తప్పుపట్టారు.  ఎన్నికల సమయంలో పొరుగు దేశానికీ వెళ్లడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అవుతుందని, ఎన్నికలు జరుగుతున్న సమయంలో బంగ్లాదేశ్ లో రెచ్చగొట్టే విధంగా ప్రసంగం చేసారని ఆమె దుయ్యబట్టారు. మోడీపై చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ వర్గాలు మండిపడుతున్నాయి.  ఓటమి భయంతోనే దీదీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు.