దారి తప్పిన మమతా బెనర్జీ హెలికాప్టర్..!

దారి తప్పిన మమతా బెనర్జీ హెలికాప్టర్..!

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దారితప్పడం సంచలనమైంది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మమతా బెన్జీ... ఉత్తర దినాజ్‌పుర్‌లోని బహిరంగ సభలో పాల్గొనడానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మమతా వస్తున్నారని తెలిసిన ప్రజలు ఎదురుచూస్తున్న వేళ.. ఆమె రాక ఆసల్యం కావడంతో ఆందోళనకు గురయ్యారు. ఇక దీదీ పాల్గొనాల్సిన ఎన్నికల ప్రచార వేదిక బంగ్లాదేశ్‌ - భారత్‌కు సరిహద్దుకు దగ్గరగా ఉండడంతో పలు అనుమాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ ఘటనపై అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించారు. సిలిగురిలో ప్రచారం నిర్వహించిన మమతా అనంతరం చోప్రాకు 20 నిమిషాల్లో రావాల్సి ఉండగా... అరగంట ఆలస్యమైంది. సభలో ప్రసంగించిన మమతా బెనర్జీ... ‘చేరుకోవాల్సిన ప్రాంతాన్ని పైలట్‌ గుర్తించకపోవడమే నా ఆలస్యానికి కారణం.. క్షమించండి.. పైలట్ దారి తప్పాడు. గమ్యస్థానానికి 22 నిమిషాల్లో చేరుకోవాల్సిన నేను 55 నిమిషాల తరవాత చేరుకున్నానని వెల్లడించారు. హెలికాప్టర్ దారి తప్పినా... చివరకు గమ్యం చేరుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీంతో మమతా బెనర్జీకి ప్రమాదం తృటిలో తప్పినట్లయింది.