మమత నయా ఆఫర్: బెంగాల్ లో ఫ్రీ టీకా 

మమత నయా ఆఫర్: బెంగాల్ లో ఫ్రీ టీకా 

పశ్చిమ బెంగాల్ లో రాజకీయం వేడెక్కింది.  ఈ ఏడాది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఇప్పటికే నుంచి ప్రచారం చేసుకుంటున్నాయి ప్రధాన పార్టీలు.  మూడోసారి కూడా ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ సాధించాలని మమత బెనర్జీ చూస్తున్నారు.  ఇక ఇదిలా ఉంటె, మమత బెనర్జీ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు.  బెంగాల్ లోని ప్రజలందరికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ను అందించేందుకు సర్కార్ సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు.  కరోనా మహమ్మారి నుంచి బయటపడాలి అంటే వ్యాక్సిన్ తీసుకోవాలని నిపుణులు సూచించడంతో ఎన్నికల్లో వ్యాక్సిన్ పాత్ర కీలకంగా మారింది.  జనవరి 16 వ తేదీ నుంచి దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.  ముందుగా దేశంలో 30 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం సిద్ధం అవుతున్నది.  అయితే, రాష్ట్రాలకు ఏ ప్రాతిపదికన కేంద్రం వ్యాక్సిన్ ను అందుబాటులో ఉంచుతుందో చూడాలి.