హింసాకాండకు నిరసనగా మమత కోల్ కతా పాదయాత్ర

హింసాకాండకు నిరసనగా మమత కోల్ కతా పాదయాత్ర

నిన్న కోల్ కతాలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా జరిపిన రోడ్ షోలో హింస, విధ్వంసం చెలరేగడంపై నిరసనగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కోల్ కతా పాదయాత్ర పేరుతో రోడ్డు షో నిర్వహించారు. నిన్న షా రోడ్ షో జరిగిన మార్గంలోనే మమత తన పాదయాత్ర నిర్వహించారు. రోడ్ షో ప్రారంభించడానికి ముందు ఆమె బెలియాఘాటలోని గాంధీ భవన్ కి వెళ్లి పుష్పాంజలి ఘటించారు. 

ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహం ధ్వంసం, బీజేపీ కార్యకర్తల హింసాకాండకు నిరసన తెలపడానికి అని చెప్పినప్పటికీ కోల్ కతా పాదయాత్రగా చెప్పిన టీఎంసీ రోడ్ షో యావత్తూ పార్టీ బల ప్రదర్శనగా సాగింది. బెలియాఘాట నుంచి శ్యామ్ బజార్ వరకు ఈ రోడ్డు షో జరిగింది.