ప్రియాంక శర్మకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్టీ ఫోటో షేర్ చేసినందుకు అరెస్ట్ అయిన బీజేపీ యువమోర్చా నేత ప్రియాంక శర్మకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మమతా బెనర్టీ మార్ఫెడ్ ఫోటోతో సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు క్షమాపణ చెప్పాలని మంగళవారం వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు ప్రియాంక శర్మను ఆదేశించింది. భావప్రకటనా స్వేచ్ఛ పేరిట ఒకరి వ్యక్తిగత మనోభావాలను దెబ్బతీయడాన్ని తాము సహించబోమని, క్షమాపణ చెప్పాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్నికల సమయం కావడం, పిటిషనర్ రాజకీయ పార్టీ కార్యకర్త కావడంతో ఈ సమయంలో క్రిమినల్ చర్యల అంశాన్ని ప్రస్తావించడంలేదని, కానీ ఎన్నికల నేపథ్యంలో క్షమాపణ అర్థించడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు తెలిపింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)