పార్లమెంటులో మమత హల్ చల్

పార్లమెంటులో మమత హల్ చల్

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాల కోసం ఢిల్లీ వచ్చిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పార్లమెంటుకి వచ్చారు. వివిధ పార్టీల అగ్రనేతలు, ఎంపీలతో ఆమె పార్లమెంట్ ఆవరణలో సమావేశం కానున్నారు. ముందుగా ఆమె బీజేపీ సీనియర్ నేత ఎల్.కె. అద్వానీని పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో కలుసుకున్నారు. మిగతా పార్టీ నాయకులను కలిసేందుకు ముందు బీజేపీ అగ్రనేతతో మమత భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది