నేడు బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ ప్రమాణం

నేడు బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ ప్రమాణం

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ నేడు పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10.45 గంటలకు రాజ్‌భవన్‌లో మమతా బెనర్జీ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు. కరోనా ఉధృతి నేపథ్యంలో ఈ కార్యక్రమానికి పరిమిత సంఖ్యలోనే ప్రతినిధులు హాజరుకానున్నారు. ఎన్నికల్లో గెలుపొందిన టీఎంసీ ఎమ్మెల్యేంతా మమతా బెనర్జీని శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మెజార్టీ స్థానాలను టీఎంసీ కైవసం చేసుకున్నప్పటికీ నందిగ్రాం నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో మమతా బెనర్జీ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం పదవి చేపట్టిన తర్వాత ఆరు నెలలోగా మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. లేదంటే.. ఆమె ఎమ్మెల్సీ కోటాలో సీఎం కావచ్చు. కాగా ఆమెతోపాటు పలువురు సభ్యులు మంత్రులుగా కూడా ప్రమాణం చేసే అవకాశం ఉంది.