దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ ఉందా... మమతా ఆగ్రహం

దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ ఉందా... మమతా ఆగ్రహం
తెలుగు రాష్ట్రాల తరవాత పశ్చిమ బెంగాల్లో కూడా నోట్ల కొరత తీవ్ర రూపం దాల్చింది. ఎక్కడ చూసినా ఖాళీ ఎంటీఎంలు దర్శనమిస్తున్నాయి. దేశంలో నోట్ల రద్దు నాటి పరిస్థితులు కన్పిస్తున్నాయని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ రాష్ట్రంలో ఏటీఎంలు ఖాళీగా ఉన్నాయని... పెద్ద నోట్లు మాయం అవుతున్నాయని ఆమె ఇవాళ ట్వీట్ చేశారు. దేశంలో ఆర్థిక ఎమర్జన్సీ ఉందా అని మమతా ప్రశ్నించారు.  ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని ఆమె తెలిపారు.