స్వామికి పెరుగుతున్న మద్ధతు

స్వామికి పెరుగుతున్న మద్ధతు

కర్ణాటక రాజకీయం క్షణానికో కొత్త మలుపు తిరుగుతూ సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. కాంగ్రెస్ మద్ధతుతో తమకు సంపూర్ణ బలం ఉన్నప్పటికీ.. సింగిల్ లార్జెస్ట్ పార్టీ అన్న సాకు చూపి గవర్నర్ ఏకపక్షంగా బీజేపీకి అధికారం అప్పగించడం పట్ల జేడీఎస్-కాంగ్రెస్‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గవర్నర్ నిర్ణయంపై ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్లిన ఈ రెండు పార్టీలు దేశంలోని ఇతర పార్టీల మద్ధుతుతో పోరాటం చేయాలని భావించాయి.

ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతీయ పార్టీల నేతలతో కాంగ్రెస్, జేడీఎస్‌లు సంప్రదింపులు జరుపుతున్నాయి. ఈ క్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయవతి మద్ధతు ప్రకటించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన కొన్ని సూత్రాలను, నైతిక విలువలను తుంగలో తొక్కి.. అధికారాన్ని దుర్వినియోగం చేసి బీజేపీ కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజాస్వామ్యంపై దాడి చేసిందని మాయవతి ఆరోపించారు. ఈ వ్యాఖ్యలకు మద్ధతు పలుకారు.. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. మాయవతి వ్యాఖ్యలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నానని.. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను మనం గౌరవించాలని ఆమె ట్వీట్ చేశారు.