ఎన్నికల ఎఫెక్ట్: తెలుగును అధికార భాషగా గుర్తించిన మమత సర్కార్ 

ఎన్నికల ఎఫెక్ట్: తెలుగును అధికార భాషగా గుర్తించిన మమత సర్కార్ 

వచ్చే ఏడాది వెస్ట్ బెంగాల్ కు ఎన్నికలు జరగబోతున్నాయి.  అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకోవడానికి మమతా సర్కార్ సిద్ధం అయ్యింది.  ముఖ్యంగా తెలుగువారిని ఆకట్టుకోవడానికి మమతా బెనర్జీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.  తెలుగు భాషను అధికారిక భాషగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నారు.  బెంగాల్ సర్కార్ ఇప్పటికే అనేక భాషలను అధికారిక భాషలుగా గుర్తించారు.  ఇప్పుడు తెలుగు భాషను కూడా అధికారిక భాషగా గుర్తించడంతో తెలుగువారికి సముచిత గౌరవం ఇచ్చినట్టు అయ్యింది.  మమతా సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ తెలుగుదేశం పార్టీ స్వాగతించింది.  పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తెలుగు భాషను అధికారిక భాషగా గుర్తించగా, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మాత్రం ఇంగ్లీష్ బాష దిశగా అడుగులు వేయడం ఏంటని ప్రశ్నించింది.  ప్రాధమిక పాఠశాలల్లో ఆంగ్లభాషలో విద్యను బోధించాలని ఇప్పటికే జగన్ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.  దీనిపై గతంలో పెను దుమారం రేగింది.