అమిత్ షా రథయాత్ర రావణయాత్ర

అమిత్ షా రథయాత్ర రావణయాత్ర

బెంగాల్లో బీజేపీ చేపట్టబోయే రథయాత్రలను రావణయాత్రలతో పోల్చారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఇవాళ కోల్ కటాలో జరిగిన టీఎంసీ కోర్ కమిటీ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు ప్రకటించిన మమత... రాష్ట్రంలో బీజేపీ నాయకులు చేసే రథయాత్రలు రావణ యాత్రలని అన్నారు. అమిత్ షా రథం.. ఫైవ్ స్టార్ ఏసీ హోటల్ ను తలపిస్తుందని, కాబట్టి అది ఎంతో ఖరీదైన రావణ యాత్ర అని, ఆ రావణయాత్రలు పూర్తయ్యాక.. తమ కార్యకర్తలు అవే బాటల్ని శుద్ధి చేస్తూ పవిత్ర యాత్ర చేస్తారన్నారు. బీజేపీ రథాలు శ్రీకృష్ణుడికో, జగన్నాథుడికో చెందినవి కావని.. కేవలం రాజకీయ రథాలని... అందువల్ల ఆ బాటను శుద్ధి చేయాలని తమ కార్యకర్తల్ని ఆదేశించారు. బీజేపీ యాత్రలకు ప్రత్యామ్నాయంగా టీఎంసీ "శాంతి మరియు ఏకతా యాత్ర"లు చేస్తుందని ప్రకటించారు. 

ఇక అమిత్ షా రానున్న సార్వత్రిక ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని మమతా బెనర్జీ వైఫల్యాలను ఫోకస్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో 3 రథయాత్రలకు ప్లాన్ చేస్తున్నారు. ప్రధానమైన యాత్రను అమిత్ షా ప్రారంభిస్తారని, యాత్రల ముగింపు సమావేశానికి మోడీ హాజరవుతారని బీజేపీ నేతలు చెబుతున్నారు. దీంతో బీజేపీకి దీటుగా టీఎంసీ కూడా పకడ్బందీ వ్యూహం రచిస్తోంది.