నందిగ్రామ్ లో ఆసక్తికర పోరు...మమతపై సువేందు పోటీ...
పశ్చిమ బెంగాల్ లో జరగబోతున్న ఎన్నికలు రసవత్తరంగా మారబోతున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని పార్టీలు తమ ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అయితే, తృణమూల్ కాంగ్రెస్ నుంచి అనేకమంది నేతలు ఇప్పటికే బీజేపీలో జాయిన్ అయ్యారు. టిఎంసి... బీజేపీ మధ్య ప్రధానపోరు జరగబోతున్నది. ఈ ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజక వర్గంపైనే అందరి కళ్ళు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఈ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నది. అయితే, నందిగ్రామ్ నియోజక వర్గంపై గట్టి పట్టు ఉన్న నేత సువేందు అధికారి ఈ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి బరిలో ఉన్నారు. మమతపై పోటీ చేసి 50వేలకు పైగా మెజారిటీతో విజయం సాధిస్తానని గతంలోనే సువేంధు అధికారి స్పష్టం చేశారు.
అధికారి కోరుకున్న విధంగానే నందిగ్రామ్ నుంచి పోటీకి దించుతున్నట్టు బీజేపీ పేర్కొన్నది. మొదటి లిస్ట్ లో ఆయనపేరును ఖరారు చేసింది. దీంతో నందిగ్రామ్ నియోజకవర్గం ఎన్నికలు ఆసక్తిగా మారాయి. రాష్ట్రంలో కుటుంబపాలన, అవినీతి అధికం అయ్యాయి. రాష్ట్రం అభివృద్ధికి దూరంగా ఉందని, ప్రజలు మార్పును కోరుకుంటున్నారని బీజేపీ నేతలు అంటున్నారు. బెంగాల్ లో విజయం తమదే అని ధీమాను వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)