ఆ అభిమాని.. సినిమా కోసం పెళ్లిని వాయిదా వేసుకున్నాడు

ఆ అభిమాని.. సినిమా కోసం పెళ్లిని వాయిదా వేసుకున్నాడు

ప్రతి మనిషి జీవితంలో పెళ్లి అన్నది ఒక మధురమైన జ్ఞాపకం.  దానికోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తుంటారు.  ఇప్పుడు దేశంలో అమ్మాయిల సంఖ్య తగ్గిపోవడంతో పెళ్లికాని ప్రసాదుల సంఖ్య పెరిగిపోతున్నది.  అది వేరే విషయం అనుకోండి.  పెళ్లి కోసం చాలామంది ఎన్నింటినో త్యాగం చేస్తుంటారు.  

కానీ, మేమొమ్ సురేష్ అనే వ్యక్తి తన తన అభిమాన హీరో మమ్ముట్టి సినిమా మామంగం సినిమా ఫస్ట్ డే రోజున చూసేందుకు తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు.  పెళ్లి వాయిదా అంటే సినిమా రిలీజ్ తరువాత కాదు.  సినిమా రిలీజ్ కు దాదాపు నెలరోజుల ముందుకు ప్రీ ఫోన్ చేసుకున్నాడు.  మమ్మూట్టి మామంగం సినిమా నవంబర్ 21 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  అదే రోజున సురేష్ వివాహం ఉన్నది.  దీంతో సినిమా కోసం తన పెళ్లిని ముందుకు జరుపుకొని అక్టోబర్ 30 వ తేదీన వివాహాం చేసుకున్నాడు.  పెళ్లి తరువాత జరిగే అన్ని కార్యక్రమాలు పూర్తవుతాయి కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సినిమాకు సినిమా చూడాలని అనుకుంటున్నాడు సురేష్.