ఆ మాస్క్ వేసుకున్నాడని పోలీసులు అరెస్ట్ చేశారు... 

ఆ మాస్క్ వేసుకున్నాడని పోలీసులు అరెస్ట్ చేశారు... 

కరోనా కాలంలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మార్క్ ధరించాలని, కరోనా నిబంధనలు పాటించాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేస్తున్న సమయంలో మాస్క్ వేసుకున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.  అది న్యూఇయర్ రోజున. కారణం అతను ధరించిన మాస్క్ భయపెట్టే విధంగా ఉండటమే.  న్యూఇయర్ రోజున సరదాగా ప్రాంక్ చేసేందుకు ఓ వ్యక్తి తోడేలు మాస్క్ ను ధరించి పెషావర్ లోని రోడ్డుమీదకు వచ్చారు.  భయపెట్టాలని వచ్చిన ఆ వ్యక్తిని చూసిన పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు.  అయితే, తాను కేవలం ప్రాంక్ చేసేందుకు మాత్రమే మాస్క్ ధరించానని చెప్పినా పోలీసులు వినలేదు.  అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకెళ్లారు.  దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యింది.  అంతే పోలీసుల తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.  మాస్క్ ధరించని వ్యక్తులను పోలీసులు ఏమి చేయడం లేదని, ఏదొక మాస్క్ పెట్టుకొని వ్యక్తిని అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు.  అరెస్ట్ చేసిన ఇద్దరు పోలీసుల్లో ఒకరు మాస్క్ ధరించలేదని, పోలీసులే పట్టించుకోవడం లేదని, సామాన్యప్రజలు ఎలా ఫాలో అవుతారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.