న్యూడ్‌ ఫోటో పంపు.. ఫిజిక్ చూసి ఉద్యోగానికి సెలక్ట్ చేస్తా..!

న్యూడ్‌ ఫోటో పంపు.. ఫిజిక్ చూసి ఉద్యోగానికి సెలక్ట్ చేస్తా..!

ఆకర్షణీయమైన జీతంతో పాటు మంచి ఉద్యోగం కావాలంటే.. మంచి ఫిజక్ ఉండాలి.. నీ న్యూడ్ ఫొటోస్ పంపు.. ఉద్యోగానికి సెలక్ట్ చేస్తా నంటూ నిరుద్యోగ యువతకు ట్రాప్ చేసి.. ఆ పై బ్లాక్‌మెయిల్ చేసే కంత్రీగాడిని అరెస్ట్ చేశారు మియాపూర్ పోలీసులు. వివరాల్లోకి వెళ్తే.. మహిళల ఫిర్యాదుతో.. కార్పొరేట్ ఉద్యోగం పేరిట వందలాది మంది యువతులను మోసం చేసిన కేటుగాడి బాగోతం బట్టబయలైంది. తమిళనాడుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ప్రదీప్.. ఫేస్‌బుక్‌లో అమ్మాయి పేరుతో ఖాతా ఓపెన్ చేశారు. అర్చనా జగదీష్‌గా ఎఫ్‌బీలో అడుగుపెట్టి.. ఆన్‌లైన్‌ వేదికగా ఉద్యోగ వేటలో ఉన్న మహిళలు, యువతులను టార్గెట్ చేశాడు. వారి వివరాలు సేకరించి.. ఇంటర్వ్యూ పేరుతో సందేశాలు పంపేవాడు. అలా వారిని మెల్లగా ట్రాప్‌ చేసేవాడు.. త్రీస్టార్, ఫైవ్ స్టార్ హోటళ్లలో, సాఫ్ట్‌వేర్ కార్యాలయాల్లో ఫ్రంట్ ఆఫీస్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ వారికి గాలం వేసేవాడు.. అక్కడే తన కంత్రీ మైండ్ ఉపయోగించి.. ఈ ఉద్యోగానికి మంచి ఫిజిక్ ఉండాలని.. న్యూడ్ ఫోటో పంపిస్తే పరిశీలించి ఉద్యోగానికి సెలక్ట్ చేస్తానంటూ, మంచి జీతం ఉంటుందని, మంచి లైఫ్‌ ఉంటుందని వారిని బుట్టలో వేసేవాడు.. ఇలా దాదాపు 600 మంది యువతులు, మహిళల నుంచి 2 వేలకు పైగా న్యూడ్ ఫోటోస్ సేకరించాడు. తమిళనాడు, తెలుగు రాష్ట్రాలే కాదు.. దేశవ్యాప్తంగా దాదాపు 15 రాష్ట్రాలకు చెందిన యువతులు తమ న్యూడ్ పిక్స్‌ను ఈ కేటుగాడికి పంపించారు. ఇక, ఆ ఫోటోలను అడ్డం పెట్టుకుని ప్రదీప్ మహిళలను బ్లాక్ మెయిల్‌కు దిగడంతో.. పోలీసులను ఆశ్రయించారు బాధితులు. రంగంలోకి దిగిన మియాపూర్ పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.