ప్రేమించిన యువతి కోసం సొంతింటికే కన్నం

ప్రేమించిన యువతి కోసం సొంతింటికే కన్నం


అమ్మాయి కోసం సొంతింటికే కన్నం వేశాడు ఓ ప్రబుద్ధుడు. తాను ప్రేమించిన యువతి కోసం కన్నతల్లికే టోకరా వేసి.. సొంత ఇంట్లోనే 50 వేల రూపాయల నగదుతో పాటు 8 తులాల బంగారం చోరీ చేశాడు. వాటిని తన గాళ్ ఫ్రెండ్ కి ఇచ్చాడు.. తల్లి తన బంగారు నగలు కనిపించకపోవడంతో కుమారుడిని నిలదీసింది.. తనకేమి తెలీయదని చెప్పడంతో సంజీవ్ రెడ్డి నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది..  పోలీసులు కుమారుడిని అదుపులోకి తీసుకున తమ స్టైల్లో అతడికి క్లాస్ పీకారు.. దీంతో ఆ సొమ్మంతా తన గాళ్ ఫ్రెండ్ కోసం ఖర్చుచేసినట్లు వెల్లడించాడు. ఆ కుమారుడిని అరెస్ట్ చేసి  420, 380 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.