రాత్రి భార్యతో గొడవపడి బయటపడుకున్నాడు... తెల్లారగానే...!!!

రాత్రి భార్యతో గొడవపడి బయటపడుకున్నాడు... తెల్లారగానే...!!!

భార్యాభర్తల మధ్య కలహాలు కామన్.  కొట్టుకుంటారు తిట్టుకుంటారు.  మరలా కలిసిపోతారు.  అయితే, భర్తకు చెడు అలవాట్లు ఉంటె మాత్రం ఆ భార్యాభర్తల మధ్య ఇలాంటి గొడవలు చాలా కామన్ గా జరుగుతూనే ఉంటాయి.  మద్యానికి బానిసైన ఓ భర్త తన భార్యతో గొడవపడి రాత్రి బయటపడుకున్నాడు.  

రాత్రి అలా బయటపడుకున్న ఆ భర్త తెల్లారేసరికి రక్తపుమడుగులో చనిపోయి కనిపించాడు.  దీంతో షాకైన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన కడపలోని భగత్ సింగ్ నగర్ లో జరిగింది.  వివరాల్లోకి వెళ్తే... భగత్ సింగ్ నగర్లో నివసించే ఓ వ్యక్తి ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.  ఈ సమయంలోనే తాగుడు అలవాటైంది.  మద్యానికి బానిసైన వ్యక్తి తరచుగా భార్యతో గొడవపడేవాడు.  అలా గొడవపడి రాత్రి బయటపడుకోగా, గుర్తు తెలియని వ్యక్తులు మంచం కోళ్లతో దాడిచేసి చంపేశారు.  అయితే, బంధువులే చంపి ఉండొచ్చని స్థానికులు చెప్తున్నారు.  పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు.