తల్లిని చూసి తల్లడిల్లిన కొడుకు... ఒక్కసారి ఇటు చూడవూ..!

తల్లిని చూసి తల్లడిల్లిన కొడుకు... ఒక్కసారి ఇటు చూడవూ..!

కన్న తల్లిని మించిన దైవం లేదంటారు. అలాటి తల్లి నరకయాతన పడుతుంటే.. ఆ కొడుకు మనసు తల్లడిల్లిపోయింది. తన తల్లి బాధను తగ్గించాలని ఏ కొడుకు అయినా అనుకుంటాడు. కానీ దగ్గరకు వెళ్లలేని పరిస్థితి. తన తల్లి వద్దకు వెళ్లి అమ్మా నేను ఉన్నాను, నీకేం కాదు. అని ధైర్యం చెప్పి తన తల్లిని బ్రతికించుకోవాలని ఉన్నా.. అతను ఏం చేయలేకపోయాడు. ఎందుకంటే ఆ తల్లికి కరోనా మహమ్మారి సోకింది.  దీంతో ఆసుపత్రికి వెళ్లి చూడలేని పరిస్థితి. ఏంచేయాలో తెలియక ప్రతి రోజు రాత్రి ఆసుపత్రిలోని గదికి ఉన్న కిటికీ ఎక్కి కూర్చొని తన తల్లిని చూసేవాడు.  ఈ సంఘటన పాలస్తీనాలోని ఓ ఆస్పత్రిలో చోటు చేసుకుంది.  కరోనా సోకి కొన ఊపిరితో ఉన్న తన అమ్మను పట్టుకుని మనసారా ఏడవాలని అనుకున్నాడు. కరోనా కారణంగా ఆ తల్లిని తాకకుండా వెనక్కి వచ్చేసాడు. తల్లిదండ్రులను పట్టించుకోని ఈ కాలంలో ఇలాంటి కొడుకు ఉండటం ఆ తల్లి చేసుకున్న అదృష్టమే అనుకుంటున్నారు.