క్రేజీ వీడియో: కారు బోనెట్ పై 2కి.మీల ప్రయాణం

క్రేజీ వీడియో:  కారు బోనెట్ పై 2కి.మీల ప్రయాణం

వెనక నుంచి ఆ కారుని చూస్తేనే ఏదో తేడాగా వెళ్తున్నట్టు కనిపించింది. ముందు చూసినవాళ్లంతా అవాక్కయ్యారు. నీలం చొక్కా వేసుకున్న ఒక మనిషి వేగంగా వెళ్తున్న తెల్లరంగు హ్యుండై ఐ20 కారు బోనెట్ పట్టుకొని ఉన్నాడు. 

కారుని పట్టుకున్న వ్యక్తి ఒక కాలికి చెప్పు లేదు. ఆ కాలు రోడ్డుకి తగిలేంత ఎత్తులో ఉంది. ఎప్పుడు ఎక్కడ జారి పడతాడో తెలీదు. కానీ ఆ కార్ డ్రైవర్ మాత్రం ఎక్కడా ఆపడం లేదు.  పాము మాదిరిగా మెలికలు తిప్పుతూ నడుపుతున్నాడు. ఇది ఢిల్లీకి సమీపంలోని ఘాజియాబాద్ లో రద్దీగా ఉన్న రోడ్డుపై బుధవారం కనిపించిన దృశ్యం.

జంక్షన్ లో నిలబడిన ఇద్దరు దూరం నుంచి ఈ దృశ్యాన్ని చూసి వెంటనే కెమెరాతో చిత్రీకరించడం ప్రారంభించారు. కారు వారి వైపుగానే దూసుకొస్తోంది. అయినా వీళ్లు తమ పని కానిచ్చేశారు. చివరికి వీళ్ల ముందుకి వచ్చి ఆ కారు ఆగిపోయింది. కారు మలుపు తిరగబోతే ఒక వాహనం అడ్డురావడంతో ఆగిపోయింది. ఒక నిమిషం కంటే తక్కువ నిడివి ఉన్న ఈ వీడియోని ఏఎన్ఐ వార్తాసంస్థ పోస్ట్ చేసింది. ఈ ప్రమాదకర స్టంట్ 2కి.మీల దూరం పాటు సాగినట్టు పేర్కొంది.

కారు బోనెట్ పట్టుకున్న వ్యక్తి ఆగి ఉన్న కారుకి అడ్డం నిలబడి దారి ఇచ్చేందుకు ఏ కారణం చేతనో నిరాకరించాడు. తన చెప్పుతో కారు అద్దంపై గట్టిగా దెబ్బలు కొట్టినట్టు ఉన్నారు. అప్పుడు ఆ చుట్టుపక్కలవాళ్లు ఈ చోద్యం చూశారు. 

కారు ఆగినప్పటికీ కోపంతో కారుని గట్టిగా పట్టుకున్న వ్యక్తి  ఆగ్రహం చల్లారలేదు. వెంటనే కారు దిగి అద్దాలపై గట్టిగా కొడుతూ డ్రైవర్ ని బయటికి రావాలని అరవసాగాడు. మిగతా వాహనదారులు ఆగి పోలీసులను పిలిచారు. ఢిల్లీ రిజిస్ట్రేషన్ నెంబర్ తో ఉన్న ఆ కారు డ్రైవర్ ని అరెస్ట్ చేశారు.