ఔటర్ రింగ్‌ రోడ్డపై కాల్పుల కలకలం..

ఔటర్ రింగ్‌ రోడ్డపై కాల్పుల కలకలం..

హైదరాబాద్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి... నార్సింగ్ దగ్గర ఔటర్ రింగ్ రోడ్డుపై బెంజ్ కారులో గన్‌తో వచ్చిన ఓ తనను తాను కాల్చుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. టీఎస్ 09 యూబీ 6040 నంబర్‌ గల బెంజ్ కారులో వచ్చిన వ్యక్తి నార్సింగ్ దగ్గర ఔటర్ రింగ్ రోడ్డుపై కాల్చుకున్నాడు. ఔటర్ పై వెళ్తున్న ప్రయాణికులు గమనించిన వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఘటనా సమయంలో శంషాబాద్ నుంచి హైదరాబాద్ వస్తున్నట్టు తెలుస్తోంది. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ఘటనా స్థలంలో క్లూస్ సేకరించారు. ఈ వాహనం అశ్విన్ జైన్ అనే వ్యక్తిపై రిజిస్ట్రేషన్ చేసి ఉండడంతో అశ్విన్ జైనే కాల్చుకున్నాడని మొదట భావించినా... ఆత్మహత్యాయత్నం చేసింది ఫైజాన్ అహ్మద్‌ అనే వ్యక్తిగా నిర్ధారించారు పోలీసులు. బాధితుడు హైదరాబాద్‌లో యూఎస్ కన్సల్టెన్సీ నడుపుతున్నట్టు వెల్లడించారు. ఫోర్ వీల్స్ అనే నుంచి బెంజ్ కారును ఉదయం అద్దెకు తీసుకొని వెళ్లిన ఫైజాన్.. సాయంత్రం ఆత్మహత్యాయత్నం చేశాడు.