దారుణం: కరోనా సోకిందని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న యువకుడు... 

దారుణం: కరోనా సోకిందని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న యువకుడు... 

తెలంగాణలో కరోనా వైరస్ రోజు రోజుకు విస్తరిస్తోంది.  వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అధికారులు నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు.  ఇక ఇదిలా ఉంటె, కొంతమంది వ్యక్తులు కరోనా వైరస్ సోకితే బతకడం కష్టం అవుతుందని, సరైన వైద్యం లేదని భావించి అపోహలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.  వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మేడపల్లి గ్రామానికి చెందిన మహబూబ్ ఆలీ అనే వ్యక్తికీ కరోనా సోకింది.  కరోనా సోకడంతో మనస్తాపానికి గురైన ఆలీ నర్సంపేటలోని తన ఇంటి వెనకాల ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.  కరోనా సోకిన ఆలీ కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  తరువాత అనుమానం వచ్చి ఇంటి వెనుక ఉన్న బావిలో చూడగా అందులో ఆలీ శవమై కనిపించాడు.  పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.