ప్రేమంటే ఇదే : భార్య చనిపోతే మైనం విగ్రహం పెట్టుకుని !

ప్రేమంటే ఇదే : భార్య చనిపోతే మైనం విగ్రహం పెట్టుకుని !

భార్య పక్క ఉండగానే మరో ఆమె వైపు చూసే వారు కొందరు అయితే, భార్యకు తెలీకుండా చిన్నిల్లు మైంటైన్ చేసేవాళ్ళు కొందరు. భార్య బతికి వుండగానే ప్రత్యక్ష నరకం చూపించే మగానుభావులు, పొద్దున లేస్తే అర్థాంగి మీద నలుగురిలో కుళ్లు జోకులు వేస్తూ పలుచన చేసే భర్తలు ఉన్న ఈరోజుల్లో ప్రేమంటే ఇదేనేమో అనిపించారు ఒకాయన. కర్ణాటకలోని కొప్పల్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ గుప్తా తన భార్య మైనపు విగ్రహాన్ని తయారు చేయించి ఆమె తనతో ఉన్నట్టే ఫీల్ అయి గృహ ప్రవేశం చేశారు.

నిజానికి కొన్నేళ్ల క్రితం ఆయన సతీమణి రోడ్ యాక్సిడెంట్ లో మరణించారు. కొందరికి ఇది అతిగా అనిపించచ్చు కానీ ఆయన అవేమీ పట్టించుకోలేదు, భార్యా తాను కలిసి కలలు కని కట్టుకున్న ఆ ఇంటికి ఒక్కడే వెళ్ళాలని అనుకోలేదు. అందుకే జీవకళ ఉట్టి పడుతున్న ఆమె మైనపు విగ్రహాన్నే తయారు చేయించి ఇంట్లో పెట్టుకున్నారున. రాజసూయ యాగానికి ఆనాడు శ్రీరాముడు బంగారంతో సీతమ్మ విగ్రహం తయారు చేయిస్తే ఈయన మైనపు సతీమణిని చేయించాడు.