భార్య చీపురుతో కొట్టిందని... ఆ భర్త... 

భార్య చీపురుతో కొట్టిందని... ఆ భర్త... 

భార్య భర్తల మధ్య గొడవలు సహజంగా ఉంటూనే ఉంటాయి.  లాక్ డౌన్ కాలంలో ఈ గొడవలు మరింత ఎక్కువగా జరుగుతున్నాయి.  రెండు దశాబ్దాలుగా కలిసి కాపురం చేస్తున్న ఫ్యామిలిలో కూడా కలహాలు వస్తున్నాయి.  ఓ భార్య కట్టుకున్న భర్తను చీపురుతో  కొట్టింది.  దీంతో ఆ భర్త కలత చెంది ఆత్మహత్య చేసుకున్నాడు.  ఈ సంఘటన పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతాలో జరిగింది.  

కోల్ కతాలో నివసించే సౌమిత్రి అనే వ్యక్తి తన భార్యతో కలిసి నివశిస్తున్నాడు.  అయితే, శనివారం రోజున భార్య భర్తల మధ్య గొడవ జరిగింది.  ఆ సమయంలో అక్కడికి వచ్చిన అత్తకూడా భర్యకు సపోర్ట్ చేయడంతో భార్య చీపురుతో భర్తను కొట్టింది.  దీంతో ఆ భర్త కలత చెందాడు.  శనివారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.  తన కొడుకును భార్య, ఆమె తల్లి కలిసి కొట్టారని అందుకే ఆత్మహత్య చేసుకున్నాడని అతని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.  పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.