కలిసి మందేసిన భార్య భర్త, మాటామాటా పెరగడంతో భార్యను కిరాతకంగా ?

కలిసి మందేసిన భార్య భర్త, మాటామాటా పెరగడంతో భార్యను కిరాతకంగా ?

భార్యాభర్తలు ఇద్దరూ కలిసి మందేశారు, అయితే అనుకోకుండా మాటామాటా పెరగడంతో భార్యను భర్త కొట్టి చంపాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా పాచిపెంట మండలం మతుమూరు గ్రామ సమీప పొలాల్లో నిన్న రాత్రి చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా పాచిపెంట మండలం మతుమూరు గ్రామ సమీపంలో ఉన్న గద్ద గంగాధర్ కు చెందిన పామాయిల్ తోటలో విశాఖ జిల్లా అరకు మండలం పూజారిపుట్టి గ్రామానికి చెందిన మర్రి శోభన్, భార్య తులసి పని చేసుకుంటూ  పామాయిల్ తోటలోనే నివసిస్తూ ఉంటున్నారు. నిన్నతోట యజమాని గద్ద గంగాధర్ నుంచి కొంత నగదును తీసుకున్న భార్యాభర్తలు ఇద్దరూ ఆ  పామాయిల్ తోట సమీపంలో ఉన్న మతుమూరు గ్రామానికి వెళ్లి నాటు సారా తాగి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చాక ఇరువురు ఘర్షణ దిగారు. ఆ తరుణంలో భర్త చేతిలో ఉన్న కర్రతో భార్య తలపై గట్టిగా కొత్తగా అక్కడికక్కడే ఆమె నేలకొరిగి మృతి చెందింది. భర్త ప్రస్తుతానికి పరారీలో ఉండగా పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నారు .