వైరల్: స్నానం చేస్తూ బాత్ రూమ్ లోనే నిద్రపోయాడు... లేచే సరికి... 

వైరల్: స్నానం చేస్తూ బాత్ రూమ్ లోనే నిద్రపోయాడు... లేచే సరికి... 

నిద్ర ఎప్పుడు ఎవరికీ ఎలా వస్తుందో చెప్పలేము.  ఖాళీగా కూర్చుంటే కొందరికి నిద్ర వస్తుంది. కొంతమంది డ్రైవింగ్ చేస్తూ నిద్రపోతుంటారు.  బస్సులో ప్రయాణం చేసే సమయంలో కునుకు తీస్తుంటారు.  అయితే, ఒంటిపై నీళ్లు పడిన సమయంలో ఎలాంటి వ్యక్తులైన సరే లేచి కూర్చుంటారు.  కానీ, ఓ వ్యక్తి బాత్ రూమ్ లో స్నానం చేస్తూ టబ్ లో పడుకొని అలానే నిద్రపోయాడు.  పెద్ద మొత్తంలో నురగ రావడంతో లోపల ఏం జరుగుతుందో తెలియక కుటుంబసభ్యులు వచ్చి తలుపు తెరిచారు.  లోపల దృశ్యాన్ని చూసి షాక్ అయ్యాడు.  స్నానం చేస్తూ నిద్రపోతున్న వ్యక్తిని లేపడంతో షాక్ అయ్యాడు.  దీనికి సంబంధించిన చిన్న వీడియో సోషల్ మీడియాలో షేర్ అయ్యింది.  ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.