పాతబస్తీ లో ట్రిపుల్ తలాక్ కేసు.!
పాతబస్తీలో మరో ట్రిపుల్ తలాక్ కేసు నమోదైంది. అమెరికా నుంచి ఫోన్లో తలాక్ చెప్పాడు అది వలీ అనే వ్యక్తి. పాతబస్తీకి చెందిన ఫాతిమాతో అది వలీకి 2015 లో వివాహం జరిగింది. సోమాలియాలో జన్మించి అమెరికాలో ఉంటున్న అది వలీ పాత బస్తీకి చెందిన సబా ఫాతిమాను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత అది వలీ అమెరికాకు వెళ్లిపోయాడు. అయితే.. ప్రతి ఆరు నెలలకు ఒకసారి వలీ హైదరాబాద్ వస్తాడని బాధితురాలు ఫాతిమా పేర్కొంది. కానీ ఫిబ్రవరిలో రావాల్సిన వలీ... ఈ సారి రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా వలీ ఫోన్ చేసి తనకు తలాక్ చెప్పాడని తెలిపింది. దీంతో ఆవేదనకు గురైన బాధితురాలు ఫాతిమా తనకు న్యాయం చేయాలంటూ విదేశాంగ మంత్రిత్వ శాఖను ఆశ్రయించింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)