సొరచేప పొట్టలో మనిషి చేయి.. షాకైన అధికారులు.. 

సొరచేప పొట్టలో మనిషి చేయి.. షాకైన అధికారులు.. 

అనగనగా ఓ బీచ్.. ఆ బీచ్ ను చూడగానే ఎవరికైనా సరే సముద్రంలోకి దిగి ఎంజాయ్ చేయాలనిపిస్తుంది.  జాగ్రత్తలు తీసుకోకుండా సముద్రంలోకి దిగితే.. మృత్యువు ఏ క్షణంలో అయినా సరే తరుముకుంటూ రావొచ్చు. ఆ బీచ్ ఎంత ఆకర్షణగా ఉన్నప్పటికీ అందులోకి వెళ్లాలంటే పర్యాటకులు ఒకటికి నాలుగుసార్లు అలోచించి దిగుతుంటారు.  

ఇలా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకొని సముద్రంలోకి దిగి పర్యాటకులు ఎంజాయ్ చేస్తుంటే.. మృత్యువు టైగర్ సొరచేప రూపంలో తరుముకుంటూ వచ్చింది.  దాని దాడి నుంచి తప్పించుకున్న పర్యాటకులు అదునుచూసి ఆ సొరచేపను చంపేశారు.  ఆ సొరచేపను ఒడ్డుకు తీసుకొచ్చి పొట్టకోసి చూడగా షాక్ అయ్యారు.  అందులో ఓ మనిషి చేయి ఉన్నది.  ఆ చేతికి ఉంగరం కూడా ఉంది.  దీంతో అధికారులు ఆ చేతిని, ఉంగరాన్ని స్వాధీనం చేసుకున్నారు.  ఆ ఉంగరం తన భర్తదే అని ఓ మహిళా కంప్లైంట్ చేసింది.  గత శనివారం రోజున భర్తతో కలిసి ఆ బీచ్ కు వచ్చింది.  సముద్రంలోకి దిగిన భర్త ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో ఆమె పోలీసులకు కంప్లైంట్ చేసింది.  అయితే, సడెన్ గా అతని చేయి సొరచేప కడుపులో ఉండటంతో అధికారులు షాక్ అయ్యారు.  ఈ సంఘటన బెల్జియంలోని రీయూనియన్ బీచ్ లో జరిగింది.