వివాహితను వేధించిన కామాంధుడికి దేహశుద్ధి..

వివాహితను వేధించిన కామాంధుడికి దేహశుద్ధి..

ఒక్కో ప్రాంతంలో ఒక్కో తరహాలో మహిళలపై వేధింపులు పెరిగిపోతూనే ఉన్నాయి... కర్నూలు జిల్లా ఓర్వకల్లు గ్రామానికి చెందిన ఓ వివాహితపై కన్నేసిన కామాంధుడు.. ఆమె భర్త అనారోగ్యంగా ఉండడానికి అలుసుగా తీసుకుని వేధింపులకు గురిచేశాడు... అదే గ్రామానికి చెందిన మౌలాలి అనే వ్యక్తి నిత్యం ఫోన్‌ చేస్తూ అసభ్యకరమైన మాటలతో వేధించసాగాడు. నా భర్తకు అనారోగ్యంగా ఉంది నన్ను వదిలేయమని సదరు మహిళ విజ్ఞప్తి చేసినా కామాంధుడి తీరు మారలేదు. ఇక ఇవాళ భర్తకు నాటువైద్యం కోసం డోన్‌లోని పుట్టింటికి వెళ్లింది వివాహిత. అదే సమయంలో ఫోన్ చేసిన మౌలాలి... మనం పెళ్లి చేసుకుందామంటూ వేధించాడు. దీంతో విషయాన్ని తన సోదరులకు తెలిపింది వివాహిత. ఇక సోదరులు ఆ వివాహితో పెళ్లికి సరే అని ఫోన్ చేయించి.. పాత బస్టాండ్‌కు రప్పించారు. అనంతరం అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ వరకు ఈడ్చుకెళ్తూ దేహశుద్ధి చేసి.. పోలీసులకు అప్పగించారు.