బట్టతల విషయం దాచిపెట్టి పెళ్లి చేసుకున్నాడని... ఆ భార్య... 

బట్టతల విషయం దాచిపెట్టి పెళ్లి చేసుకున్నాడని... ఆ భార్య... 

ఈరోజుల్లో పురుషులకు బట్టతల సర్వసాధారణం అయ్యింది.  ఆహరం, మనిషి లైఫ్ స్టైల్ కారణంగా బట్టతల వస్తోంది.  నిత్యం సవాళ్లతో కూడిన పనులు చేస్తుండటంతో బట్టతల రావడం జరుగుతున్నది.  పురుషుల్లో బట్టతల కామనే.  అయితే, ముంబైకి చెందిన ఓ వ్యక్తి తనకు కాబోయే భార్యకి ఈ విషయం చెప్పలేదు.  విగ్గుతో మ్యానేజ్ చేశాడు.  పెళ్ళైన కొన్ని రోజులకు భర్తకు బట్టతల ఉన్న విషయం బయటపడింది.  భర్తను నిలదీసింది. ఈరోజు బట్టతల సర్వసాధారణమే అని అత్తమామలు సర్ది చెప్పేందుకు ప్రయత్నం చేశారు.  కానీ, ఆ భార్య వినలేదు.  తనను మోసం చేశాడని చెప్పి కేసు పెట్టింది.  భార్యకు విషయం చెప్పకుండా విషయం దాచిపెట్టినందుకు పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.