కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటి వద్ద బాంబు పేలుడు

కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటి వద్ద బాంబు పేలుడు

బెంగళూరులో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటి వద్ద జరిగిన బాంబు పేలుడులో ఓ వ్యక్తి మరణించాడు. రాజరాజేశ్వరి నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మునిరత్న ఇంటి సమీపంలో ఆదివారం ఉదయం పేలుడు సంభవించింది. ఆ సమయంలో అటువైపు నుంచి నడుచుకుంటు వెళుతున్న వెంకటేశ్ అనే వ్యక్తి మృతి చెందాడు. పేలుడు కారణంగా ఆ ప్రాంతంలో గొయ్యి ఏర్పడింది. బాంబ్‌ స్క్వాడ్ రంగంలోకి దిగి ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టింది. ఎమ్మెల్యేను హత్య చేయడానికి ఎవరైనా కుట్ర పన్నారేమోనని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.