దారుణం: కోడికూర వండలేదని భార్యను హత్యచేసిన భర్త...
మనిషి క్రమంగా మానవత్వం కోల్పోతున్నాయి. చిన్న చిన్న విషయాలకు గొడవలు పడుతూ హత్యలు చేస్తున్నారు. నచ్చిన కూరలు వండలేదని ఇంట్లో భార్యలను కొట్టడమే కాకుండా ఏకంగా హతమారుస్తున్నారు. ఇటీవలే ఓ భర్త దసరా రోజున కోడికూర వండలేదని భార్యను దారుణంగా హత్య చేశాడు. ఆలస్యంగా ఈ వార్త వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన నాగర్ కర్నూలు జిల్లాలోని లింగాలపల్లి మండలంలోని క్యాంపు రాయవరం గ్రామంలో జరిగింది. గ్రామంలో నివసించే సన్నయ్య అనే వ్యక్తి తాగుడుకు బానిస అయ్యాడు. పండగ రోజున తాగి ఇంటికి వచ్చి కోడికూర చేయమని అడగ్గా, అందుకు ఆమె ఒప్పుకోలేదు. దీంతో భార్యను కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం భార్య శవాన్ని ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఇంట్లో నుంచి వాసనలు వస్తుండటంతో చుట్టుపక్కలవాళ్ళు వచ్చి చూడగా ఇంట్లో శవం కనిపించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)