అల్లుడు నిర్వాకం: మామ కళ్ళ ముందే అత్తను ఇలా... 

అల్లుడు నిర్వాకం: మామ కళ్ళ ముందే అత్తను ఇలా... 

తన కోపమే తనకు శత్రువు అంటారు.  ఆవేశం అన్ని వేళలా పనికిరాదు.  ఆవేశానికి పొతే  ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది.  ఆవేశానికి పోయిన ఓ అల్లుడు ఓ ఘాతుకానికి పాల్పడ్డాడు.  చివరకు ప్రాణాలు పోగొట్టుకున్నాడు.  వివరాల్లోకి వెళ్తే, బెంగళూరు నగరంలో చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తికి కొన్నేళ్ల కిందట పెళ్లి జరిగింది.  వీరికి పదేళ్ల బాబు ఉన్నాడు.  అయితే, గత కొంతకాలంగా కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి.  ఆ కలహాలు చివరకు విడాకులు తీసుకునే వరకు వచ్చాయి.  

ఇద్దరి మధ్య కీచులాట పెద్దది కావడంతో, ఆవేశంతో భర్త భార్యను హత్య చేశాడు.   ఆ తరువాత తాపీగా బెంగళూరు నుంచి కోల్ కతా విమానంలో అత్తగారింటికి వెళ్ళాడు.  ఇంట్లో ఉన్న అత్తను తుపాకీతో షూట్ చేశాడు.  అక్కడే ఉన్న మామ భయపడి  అల్లుడిని ఇంట్లోనే ఉంచి గడియవేసి చుట్టుపక్కల వాళ్ళను పిలిచాడు.  పోలీసులకు సమాచారం అందించాడు.  పోలీసులు వచ్చి తలుపు తీయగా, అప్పటికే అతను ఆత్మహత్య చేసుకున్నాడు.  తాను తన భార్యను కూడా హత్య చేసినట్టు సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు.