ఆంటీల‌కు సుఖ‌పెట్టాలంటూ టెక్కీకి గాలం... చివ‌ర‌కు !

ఆంటీల‌కు సుఖ‌పెట్టాలంటూ టెక్కీకి గాలం... చివ‌ర‌కు !

ఆంటీల‌ను సుఖ‌పెట్టాలి... వేల‌ల్లో డ‌బ్బు వ‌స్తుంది.. అంటూ సైబ‌ర్ నేర‌గాళ్లు విసిరిన వ‌ల‌లో చిక్కాడు ఓ నిరుద్యోగి... క‌రోనా ఎఫెక్ట్ చాలా మంది ఉద్యోగాలు ఊడిపోయేలా చేసింది.. క‌రోనా దెబ్బ‌కు ఉద్యోగం పోయిన ఓ టెక్కీ... ఆన్‌లైన్‌లో కొత్త ఉద్యోగాల వేట మొద‌లు పెట్టాడు.. అలా వెతుకుతున్న స‌మ‌యంలో.. అత‌డికి ఆక‌ర్ష‌ణీయ‌మైన ఓ ప్ర‌క‌ట‌న క‌న‌బ‌డింది.. అదే.. ఆంటీల‌ను సుఖ‌పెట్టాలి... రోజుకు వేల‌ల్లో డ‌బ్బు అనేది దాని సారాంశం.. అంటే ప‌చ్చిగా చెప్పాలంటే మ‌గ వ్య‌భిచారి.. అయితే, ఆ ప్ర‌క‌ట‌న మాయ‌లో ప‌డి.. అస‌లే ఉద్యోగం పోయి క‌ష్టాల్లో ఉన్న మాజీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. ఏకంగా రూ.83,500 కోల్పోయాడు. 

వివ‌రాల్లోకి వెళ్తే.. లాక్‌డౌన్ కారణంగా బెంగళూరుకు చెందిన ఓ యువకుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోల్పోయాడు. దీంతో వేరే ఉద్యోగం కోసం వెత‌క‌సాగాడు.. ఆన్‌లైన్‌లో ఓ ప్రకటన చూసి.. న‌చ్చ‌డంతో దానిపై క్లిక్ చేసి మొబైల్ నంబర్‌తో లాగిన్ అయ్యాడు. అయితే, కొద్దిరోజుల తర్వాత అతడికి అవతలి నుంచి ఫోన్ వచ్చింది. అస‌లే ప్ర‌క‌ట‌న‌చూసి ఇరుక్కుపోయిన ఆ యువ‌కుడిని.. ధనవంతుల కుటుంబాలకు చెందిన ఆంటీల కోరికలు తీర్చాలి, వారికి కావాల్సిన సఖాన్ని పంచి సంతృప్తిప‌ర‌చాలి.. రోజుకు వేల‌ల్లో డ‌బ్బు.. సుఖానికి సుఖం.. డ‌బ్బుకు డ‌బ్బు రెండూ ర‌కాలుగా లాభం అంటూ మాట‌ల‌తో బుట్ట‌లోకి దింపాడు.. ఇక‌, మైకంలో ప‌డిపోయిన యువ‌కుడు.. రూ.1009 చెల్లించి తన పేరు రిజిస్టర్ చేయించుకున్నాడు. మెంబర్‌షిప్ ఫీజు కింద మరో రూ.12,500 చ‌దివించాడు.. సెక్యూరిటీ, ఇతర ఫీజులంటూ మరో రూ.70 వేలు కూడా గుంజారు కేటుగాళ్లు.. ఇక‌, అంత‌టితో ఆగ‌కుండా.. సుఖాన్ని పంచే ఆ ఉద్యోగంలో చేరాలంటే మ‌రింత డ‌బ్బు ఇవ్వాలంటూ... అందిన‌కాడికి గుంజే ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు.. అయితే, త‌న ద‌గ్గ‌ర ఇక డ‌బ్బులు లేవ‌ని.. ఉద్యోగంలో చేరిన త‌ర్వాత  మిగ‌తా సొమ్ము చెల్లిస్తాన‌ని చెప్పుకొచ్చాడు ఆ యువ‌కుడు.. కానీ, అప్ప‌టి నుంచి అవ‌త‌లి వ్య‌క్తి ఫోన్ స్విచ్ఛాఫ్ అయితే గానీ.. అస‌లు విష‌యం అర్థంకాలేదు.. మోస‌పోయాన‌ని గ్ర‌హించిన ఆ యువ‌కుడు చివ‌ర‌కు బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.