గొడ్డలితో నరికి దారుణ హత్య..

గొడ్డలితో నరికి దారుణ హత్య..

భూ వివాదం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం బలరావుపేట గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బలరావుపేట గ్రామ శివారులో భూ వివాదంలో ఘర్షణ జరిగింది. భూమి హద్దుల వద్ద మొదలైన ఘర్షణ.. హత్యకు దారి తీసింది. పెట్టం శంకరయ్య అనే వ్యక్తిని గొడ్డలితో నరికి చంపారు అల్లం బాలయ్య అనే వ్యక్తి కుటుంబ సభ్యులు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.