అందరూ చూస్తుండగానే చంపేశారు...

అందరూ చూస్తుండగానే చంపేశారు...

హైదరాబాద్‌లో దారుణం జరిగింది... ఖైరతాబాద్‌లో అందరూ చూస్తుండగానే శివ కిరణ్ అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు. చింతలబస్తీలో స్నేహితుడిని కలిసేందుకు వచ్చిన శివ కిరణ్‌పై పక్కా ప్లాన్‌ ప్రకారం దాడి చేసి హతం చేశారు. శివ కిరణ్‌పై విచక్షణ రహితంగా కత్తితో దాడి చేసి పొడిచి చంపేశారు. మృతుడి స్వస్థలం కర్నూలు కాగా... ప్రస్తుతం కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్నాడు. గతంలో ఓ మర్డర్ కేసుతో పాటు మరి కొన్ని కేసుల్లో శివ కిరణ్ నిందితుడు. పాతకక్షలే శివ కిరణ్‌ హత్యకు కారణంగా అనుమానిస్తున్నారు పోలీసులు.