భార్య పై అనుమానం.. దారుణంగా హత్య చేసిన భర్త !

భార్య పై అనుమానం.. దారుణంగా హత్య చేసిన భర్త !

రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధి అంజయ్య నగర్ లో దారుణం జరిగింది. భార్య ఫర్హాన ఖురేషి(25) పై అనుమానంతో కడుపులో కత్తితో పొడిచి భర్త మోసిన ఖాన్ హత్య చేశాడు. అక్కడికక్కడే భార్య ఫర్హాన ఖురేషి మృతి చెందింది.కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఫర్హాన ఖురేషి అయిదు నెలల క్రితం మోసిన ఖాన్ తో ప్రేమలో పడి వివాహం చేసుకుంది. మృతురాలికి ఇదివరకు ఇద్దరితో వివాహం కాగా ఆ ఇద్దరి నుండి విడాకులు తీసుకుంది. మోసిన ఖాన్ తో వివాహం తరువాత చెడు అలవాట్లకు లోనైందని అనుమానంతో ఇద్దరి మధ్య తరచు గొడవలు జరుగుతూ ఉండేవి. దీంతో నిన్న అర్ధ రాత్రి ఇద్దరి మధ్య గొడవలో మాట మాట పెరిగి హత్యకు దారి తీసింది. మృతురాలి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్న రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.