వైరల్: ఒంటికి నిప్పు అంటించుకొని అలా ప్రొపోజ్ చేశాడు...
సినిమాల్లో ఫైట్ మాస్టర్లు సాహసాలు చేస్తుంటారు. సినిమా కాబట్టి సరే బాగుంది పేరొస్తుంది అనుకోవచ్చు. నిజ జీవితంలో కూడా అలాంటి సాహసమే చేస్తే చాలా ఇబ్బందులు వస్తాయి. సినిమాలు, సాహసాలు చేయడం తప్పించి మరొక ప్రపంచం తెలియని రికి అనే 52 ఏళ్ల ఫైట్ మాస్టర్, 48 ఏళ్ల మహిళతో ప్రేమలో పడ్డాడు. ఆమెను ఎలాగైనా ప్రపోజ్ చేయాలని అనుకున్నాడు. కానీ, ఎలా ప్రపోజ్ చేయాలో తెలియలేదు. తనకు తెలిసిన స్టంట్ విద్యనే నమ్ముకొని ప్రపోజ్ చేయాలని అనుకున్నాడు. వెంటనే ఒంటికి మంట అంటించుకొని ఆ మంటలతో వెళ్లి తన ప్రియురాలికి ప్రపోజ్ చేశాడు. ఆమె షాక్ అయ్యింది. ఏం చెప్పాలో తెలియక బొమ్మలా నిలబడిపోయింది. ఎట్టకేలకు రికీ ప్రపోజ్ కు ఒప్పుకుంది. లేటు వయసులో సాహసోపేతమైన ఈ ప్రపోజల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)