వైరల్ : పులిపంజాకు చిక్కి కూడా తప్పించుకున్నాడు.. ఎలానో తెలుసా? 

వైరల్ : పులిపంజాకు చిక్కి కూడా తప్పించుకున్నాడు.. ఎలానో తెలుసా? 

పులి పంజా విసిరితే ఎలా ఉంటుందో ఆ దెబ్బ తిన్న వ్యక్తిగా బాగా తెలుస్తుంది.  పులి నుంచి తప్పించుకోవడం అంటే మాములు విషయం కాదు.  పులి వెంటపడుతుంది అంటే చావు తరుముకొస్తున్నట్టే. అలాంటి చావు ఎవరికీ రాకూడదని అనుకుంటారు.  సమస్య తరుముకొస్తున్నప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికి పరుగులు తీస్తామే తప్పించి బుర్రపెట్టి ఆలోచించలేము.  ఎంత సమయస్ఫూర్తి ఉన్నప్పటికీ కూడా అది ఆ సమయంలో పనిచేయదు.  

అయితే ఓ వ్యక్తి మాత్రం సమయస్ఫూర్తితో వ్యవహరించి పులిపంజా నుంచి తప్పించుకున్నాడు.  మహారాష్ట్రలోని భందారా జిల్లాలోని తుస్మార్ అనే గ్రామంలోకి పులి ప్రవేశించింది.  దీంతో గ్రామం మొత్తం అలజడి రేగింది.  పులిని తరిమికొట్టేందుకు ప్రజలు వెంటబడ్డారు.  అయితే ఆ పులి పొలాలవైపు పరుగులు తీసింది.  ఎదురుగా పులి వస్తుండటం చూసిన ఓ వ్యక్తి వెంటనే కిందపడి ఊపిరి పీల్చడం ఆపేశాడు.  అది అతని దగ్గరి వచ్చి వాసన చూసింది.  పంజాను ఛాతీపై ఉంచింది.  అదే సమయంలో అక్కడికి వచ్చిన గ్రామస్తులు రాళ్లతో పులిపై దాడి చేయడంతో పరుగులు తీసింది.  వెంట్రుకవాసిలో ఆ వ్యక్తి పులిబారి నుంచి తప్పించుకున్నాడు.  ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.