స్నేహితుడి భార్య కిడ్నాప్‌..ఆపై రేప్..భర్త తీసుకురమ్మన్నాడని !

స్నేహితుడి భార్య కిడ్నాప్‌..ఆపై రేప్..భర్త తీసుకురమ్మన్నాడని !

స్నేహమన్నా స్నేహితులు అన్నా ప్రాణమిచ్చేవారు ఉంటారు. కానీ స్నేహితుడికి సగమైన  అతని భార్యను అనుభవించాలనే దురాలోచన అతనని కటకటాలపాలు చేసింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. ఏలూరు రామకృష్ణాపురంలోని ఒక ఆస్పత్రి సమీపంలో అద్దెకు ఉంటున్న కారు డ్రైవర్‌ పల్లి నానిబాబు, మరో డ్రైవర్‌  హేమ సుందర్ అలియాస్ సురేష్ ఇద్దరూ మంచి స్నేహితులు. హేమ సుందర్ కు అతని భార్యకు తరచూ మనస్పర్థలు రావడం గమనించిన నాని ఏలాగైనా ఆమెకు దగ్గర కావాలనుకున్నాడు. ఎలాగైనా తన స్నేహితుడి భార్యను అనుభవించాలనుకున్నాడు. ఈ క్రమంలో హేమసుందర్ భార్యపై కన్నేసిన నాని అవకాశం కోసం ఎదురు చూశాడు.

గొడవలు ఎక్కువ కావడంతో ఈ నెల 9న సురేష్ భార్య ద్వారకా తిరుమలలోని పుట్టింటికి వెళ్లింది. సురేష్ ఏమో కిరాయి నిమిత్తం వేరే ఊరు వెళ్లాడు. ఇదే అద నుగా భావించిన నాని ఈ నెల 11వ తేదీ ఆమెకు ఫోన్‌ చేసి.. ‘నిన్ను నీ భర్త తీసుకురమ్మని చెప్పాడు. నేను కిరాయికి భీమడోలు వచ్చాను’ అని నమ్మబలికాడు. మరో డ్రైవర్‌ కాశీ సహకారంతో ఆమెను కారులో ఏలూరులోని తన రూమ్ కి తీసుకొచ్చి బంధించి అత్యాచారానికి పాల్ప డ్డాడు. స్థానికుల ద్వారా విషయం తెలిసిన ఆమె భర్త వచ్చి భార్యను విడిపించటానికి సురేష్ నాని రూమ్ కి వెళ్లగా అతనిని కూడా గాయపరిచారు. సురేష్ జరిగిన విషయాన్ని నాని బందువులకు తెలియజేయడంతో వారంతా నానిని నిలదీయడంతో ఆమెను పంపించివేశారు.  బాధితురాలు త్రీటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ మూర్తి కేసు నమోదు చేశారు. డీఎస్పీ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేసి నిందితులైన నాని బాబు, కాశీలను అరెస్ట్‌ చేసి కారును సీజ్‌ చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు.