వడ్డించిన అన్నంలో వెంట్రుకలు.. భార్యకు గుండు..!! 

వడ్డించిన అన్నంలో వెంట్రుకలు.. భార్యకు గుండు..!! 

ఇంట్లో హడావుడి చేసినపుడు వంటలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి.  అందులో సందేహం అవసరం లేదు. అలా పొరపాటు జరిగినపుడు తలలోని వెంట్రుకలు అన్నంలో వస్తుంటాయి.  తల వెంట్రుకలు అన్నంలో రావడం పొరపాటే.. దానికి మందలించవచ్చు.. లేదంటే భోజనం చేయకుండా వెళ్లిపోవచ్చు.. లేదు బాగా ఆకలేస్తుంది అనుకుంటే.. ఆ వెంట్రుకలు పక్కన పెట్టి తినొచ్చు.  

కానీ, బంగ్లాదేశ్ కు చెందిన బబ్లు మొండల్ అనే వ్యక్తి కోపంతో ఊగిపోయాడు.  పళ్ళు పటపట కొరుకుతూ తినే ప్లేట్ పక్కన పెట్టి..బ్లేడ్ తీసుకొచ్చి భార్యకు గుండు చేశాడు.  ఆమె లబోదిబో అని మొత్తుకోవడంతో చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చూసి షాక్ అయ్యారు. ఆ స్థానిక మానవహక్కుల సంఘం ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేయగా మొండల్ ను అరెస్ట్ చేశారు.  మహిళను హింసించిన కేసులో ఆయనకు 14 ఏళ్ళు జైలుశిక్ష పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.