లవర్ ని బిల్డింగ్ మీద నుండి నెట్టి చంపిన యువకుడు

లవర్ ని బిల్డింగ్ మీద నుండి నెట్టి చంపిన యువకుడు


హైదరాబాద్‌ వనస్థలిపురంలో దారుణం జరిగింది. ప్రియురాలిని నిర్మాణంలో ఉన్న భవనం పైనుంచి కిందకు నెట్టి చంపాడు ఓ ప్రియుడు. ఉస్మానియా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ప్రియురాలు సీమ మృతి చెందింది. ప్రియుడు దిలీప్ పరారయ్యాడు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రియుడి కోసం గాలిస్తున్నారు. 15 రోజుల క్రితం మధ్యప్రదేశ్ నుండి వచ్చి వనస్థలిపురం శక్తినగర్ లోని వాసవి నిలయం భవనం నిర్మాణాల పనిలో చేరారు వీరిద్దరు.  ర్మాణంలో ఉన్న వాసవీ నిలయం అపార్టుమెంట్ 3వ అంతస్తుపై నుంచి కిందకు ప్రియురాలిని కొట్టి నెట్టివేశాడు దిలీప్. నేలమీద పడిన సీమని ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చనిపోయింది. అయితే అసలు ఆమెను ఎందుకు చంపాలనుకున్నాడు అనే విషయం మాత్రం అంతు పట్టకుండా ఉంది. ఆ యువకుడు దొరికితే తప్ప ఈ విషయం తేలదు.