భార్యకు పిల్లలు పుట్టలేదని పక్కింటి వ్యక్తిపై కేసు పెట్టిన భార్య... చివర్లో ట్విస్ట్...
ప్రపంచంలో ప్రతి ఏడుగురిలో ఒకరు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య కారణంగా కృతిమ ఫలదీకరణం, ఐవీఎఫ్ పద్దతి ద్వారా కొంతమంది పిల్లలు లేరనే సమస్య నుంచి బయటపడుతున్నారు. పిల్లలు లేని తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించి ఈ పద్దతుల ద్వారా పిల్లలు కనేందుకు ప్రయత్నిస్తారు. కానీ జర్మనీకి చెందిన ఓ జంట విచిత్రంగా ప్రయత్నించింది. లేనిపోని కష్టాలను కొనితెచ్చుకుంది.
వివరాల్లోకి వెళ్తే... జర్మనీకి చెందిన డెమెట్రీయస్ సౌపోలస్ అనే వ్యక్తి ఆ దేశానికీ చెందిన మాజీ బ్యూటీ క్వీన్ ట్రౌటేని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని ఏళ్ళు గడుస్తున్నా పిల్లలు కలగలేదు. దీంతో డెమెట్రీయస్ సౌపోలస్ వైద్యులను కలిశాడు. పిల్లలు కలగడం అసాధ్యం అని చెప్పడంతో షాక్ అయ్యాడు. షాక్ నుంచి తేరుకొని అలోచించి ఎవరూ ఊహించని ఓ నిర్ణయం తీసుకున్నాడు. అదే విషయాన్ని తన భార్యకు చెప్పాడు. మొదట ఆమె అందుకు అంగీకరించలేదు. పిల్లలు కావాలంటే తప్పదని కన్విన్స్ చేశాడు. ఆమె అందుకు అంగీకరించింది. వెంటనే తాను అనుకున్న విషయాన్ని పక్కింట్లో ఉండే 34 ఏళ్ల మావూస్ కు చెప్పాడు. అయన సైతం అందుకు ఒప్పుకోలేదు. కానీ, ఆ పని చేసినందుకు 2500 డాలర్లు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. ఇంతకీ ఒప్పందం ఏమిటంటే తన భార్య ట్రౌటేని ఆరు నెలల్లో గర్భవతిని చేయాలి. దీనికి సంబంధించి ఇద్దరు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆరు నెలలు గడిచిపోయింది. భార్య గర్భవతి కాలేదు. అనుమానంతో మావూస్ ను వైద్యుని వద్దకు తీసుకెళ్లాడు. మావూస్ కు ఆ సత్తాలేదని వైద్యులు చెప్పడంతో షాక్ అయ్యాడు. మావూస్ భార్యకు ఈ విషయం చెప్పగా, ఆమె చెప్పిన విషయం విని డెమెట్రీయస్ సౌపోలస్ దంపతులు షాక్ అయ్యారు. తమకు పుట్టిన పిల్లలు మావూస్ వలన పుట్టిన వారు కాదని చెప్పింది. దీంతో ఆగ్రహించిన డెమెట్రీయస్ సౌపోలస్ కోర్టును ఆశ్రయించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన కేసు కోర్టులో నడుస్తోంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)