ఎన్ కౌంటర్ భయంతో ఉరేసుకున్న నిందితుడు.. షాకైన పోలీసులు 

ఎన్ కౌంటర్ భయంతో ఉరేసుకున్న నిందితుడు.. షాకైన పోలీసులు 

దిశపై అత్యాచారం, హత్య నేపథ్యంలో నిందితులను పోలీసులు ఏం ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే.  ఈ ఎన్ కౌంటర్ తో ప్రజలు చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు.  దేశంలో మహిళలపై ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడినా వారిని ఇలానే ఎన్ కౌంటర్ చేయాలని ప్రజలు కోరుకుంటున్న నేపథ్యంలో సిద్దిపేటకు చెందిన లక్ష్మీరాజ్యం అనే వ్యక్తి... తనను ఎక్కడ పోలీసులు పట్టుకొని ఎన్ కౌంటర్ చేస్తారేమో అనే భయంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.  

వివరాల్లోకి వెళ్తే... లక్మిరాజ్యం అనే వ్యక్తి గతనెల 21 వ తేదీన ఖమ్మంపల్లిలో తన భార్య పిల్లలను అతి దారుణంగా హత్య చేశాడు.  హత్యచేసి అక్కడి నుంచి పారిపోయాడు.  పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.  దాదాపు నిందితుడి కోసం 150 మంది విచారించారు.  దిశ ఘటన తరువాత లక్ష్మి రాజ్యం కు భయం వేసింది.  తనను ఎక్కడ పోలీసులు ఎన్ కౌంటర్ చేస్తారేమో అని భయంతో కొండగట్టు వద్ద ఓ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.  ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.