చేతబడి నెపం.. యువకుడి సజీవదహనం..

చేతబడి నెపం.. యువకుడి సజీవదహనం..

హైటెక్ కాలంలోనూ ప్రజలను మూఢనమ్మకాలు వీడడం లేదు... ఓవైపు చంద్రయాన్ లాంటి ప్రతిష్టాత్మకమైన ప్రయోగాలు జరుగుతుంటే.. మూఢనమ్మకాల పేరుతో ప్రాణాలు తీస్తున్న ఘటనలు విస్మయాన్ని కలిగిస్తున్నాయి. ఇది ఎక్కడో మారు మూలు ప్రాంతంలో కాదు! హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌ శామీర్‌పేట్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అద్రాస్‌పల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లక్ష్మీ అనే మహిళకు చేతబడి చేశాడన్ననెపంతో 24 సంవత్సరాల ఆంజనేయులు అనే యువకుడిని కాల్చి సజీవ దహనం చేశారు సదరు మహిళ బంధువులు. ఈ ఘటన పరిసర గ్రామాల్లో కలకలం రేపుతోంది. లక్ష్మీ చితిపైనే యువకుడ్ని వేసి సజీవదహనం చేయడం కలకలం సృష్టిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.