షాకింగ్ న్యూస్: వందరూపాయలకే న్యూడ్ ఫోటో... ఇంకా కావాలంటే...

షాకింగ్ న్యూస్: వందరూపాయలకే న్యూడ్ ఫోటో... ఇంకా కావాలంటే...

టెక్నాలజీ అభివృద్ధి చెందిన తరువాత డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలను ఎంచుకుంటున్నారు.  ఇలా ఎంచుకునే మార్గాలలో ఒకటి.  ఇటీవల కాలంలో డేటింగ్ యాప్స్ కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్నాయి.  పొరపాటున ఎవరైనా డేటింగ్ యాప్ లోకి వెళ్లి ఇన్ఫర్మేషన్ ఇచ్చి లాగిన్ అయితే, ఇక అంతేసంగతులు జేబులు గుల్ల కావాల్సిందే.  ఇంకా చెప్పాలి అంటే, మానసికంగా కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.  

రీసెంట్ గా ఓ వ్యక్తి డేటింగ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నాడు.  అలా డౌన్లోడ్ చేసుకున్న ఆ వ్యక్తికి ఓ అమ్మాయి వాయిస్ వినిపించింది.  న్యూడ్ ఫోటో కావాలి అంటే వంద పంపించాలని చెప్పింది.  సరే వందే కదా అని పంపితే ఓ అమ్మాయి న్యూడ్ ఫోటో ప్రత్యక్షం అయ్యింది.  వీడియో కావాలి అంటే ఇంత... డైరెక్ట్ గా డేట్ అయితే ఇంతా అని చెప్పడంతో భయపడి ఆ వ్యక్తి యాప్ క్లోజ్ చేశాడు.  కొన్ని రోజుల తరువాత ఆ వ్యక్తికి మెసేజ్ వచ్చింది.  డబ్బు కట్టకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని దాని సారాంశం.  దీంతో షాకైన ఆ వ్యక్తి వెంటనే పోలీసులను సంప్రదించారు.  గతంలో ఇలానే ఆ యాప్ ద్వారా 350 మంది వరకు మోసపోయారని తేలింది.