భార్య లేచిపోయిందని మహిళలంటే పగ.. ఏకంగా 17 మందిని !

భార్య లేచిపోయిందని మహిళలంటే పగ.. ఏకంగా 17 మందిని !

సైకో కిల్లర్‌ను అదుపులోకి తీసుకున్నారు రాచకొండ పోలీసులు.. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ కు చెందిన వెంకటమ్మ అనే మహిళను కిరతంగా హత్య చేసిన కేసులో ఈ సైకోను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. వెంకటమ్మను దారుణంగా హత్యచేసి.. మొహంపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు సైకో. ఈ కేసులో 20 రోజుల పాటు దర్యాప్తు చేసిన రాచకొండ పోలీసులు.. కీలక విషయాలను రాబట్టారు.. బొరబండకు చెందిన ఓ వ్యక్తిని కూడా హత్య చేసినట్టు గుర్తించారు పోలీసులు.. ముఖ్యంగా ఒంటరి మహిళలను టార్గెట్ చేసి.. దారుణంగా హత్య చేస్తున్నాడని గుర్తించారు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని కీలక సమాచారం సేకరించారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు అందించారు. 2003లో తుఫ్రాన్ పీఎస్ లిమిట్స్ లో రాములు మొదటి హత్య చేసినట్టు గుర్తించారు.

2002లో 21 ఏళ్ళ వయస్సులో ఉన్నప్పుడు రాములుకు పెళ్ళి జరిగింది. అయితే పెళ్ళైన కొద్ది రోజులకే మరొకరితో రాములు భార్య లేచిపోయింది. దీంతో అప్పటి నుండి మహిళల పై రాములు కక్ష్య పెంచుకున్నాడు. అందుకే ఒంటరి మహిళలను టార్గెట్ గా పెట్టుకొని వారిని తీసుకెళ్ళి హత్య చేస్తున్నాడు రాములు. 2009లో జరిగిన ఓ మహిళా హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష పడింది. అయితే అతని మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో ఆస్పత్రికి తరలించారు పోలీసులు. అయితే 2011లో ఎర్రగడ్డలోని మెంటల్ ఆస్పత్రి నుండి రాములు తప్పించుకున్నాడు. తప్పించుకొని వచ్చినా తీరు మార్చుకోని రాములు, తప్పించుకున్న తరువాత ఐదు దోపిడిలకు పాల్పడ్డట్టు గుర్తించారు. అనంతరం 2013లో రాములును బోయినపల్లి పోలీసులు అరెస్టు చేసి కేసులు పెట్టడంతో 2018 లో జైలు నుండి విడుదలయ్యాడు. జైలు నుండి విడుదలై వచ్చిన తరువాత వరుసగా రెండు హత్యలకు పాల్పడ్డ రాములు చివరిగా వెంకటమ్మమొహం మీద పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఆ కేసులోనే ఇప్పుడు పోలీసులకి చిక్కాడు.